15, నవంబర్ 2010, సోమవారం

కాసింత భావుకత్వం

రేయంతా కురిసిన మంచు ముత్యాలతో స్నానించి 
ఉదయం అందంగా విరబూసిన గులాబీ ని పలకరించాను. 
ఇంత అందమైన నీ మేను పై ఈ ముళ్ళు దేనికీ.. అన్నాను.      
ముళ్ళు లేని గులాబీ కూడా ఉందంది తాను. 
ఎక్కడ అని ప్రశ్నించలేదు నేను
కళ్ళముందు నీ రూపం కదిలింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి